మహిమాన్విత జనగామ శివాలయం
పునరుద్దరణలో పాలకుల నిర్లక్ష్యంరామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి జనగామ రాజరాజేశ్వర దేవాలయం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ప్రాంతంలో ఆదరణ కోల్పోయిన అనేక చారిత్రక కట్టడాల్లో ఒకటైన జనగామ శివాలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో మహిమ గల ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారు. శారీరక, మానసిక, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే అనేక మంది ఇక్కడి శివ లింగాన్ని దర్శించుకుని ఉపశమనాన్ని పొందుతారు. ఇక్కడి శివాలయ నిర్మాణంలో అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ప్రభుత్వ నిరాదరణ వల్ల అవి శిథిలమవుతున్నాయి. హిందూ పర్వదినాలలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి వచ్చిన భక్తులు ఆలయ దుస్థితిని
చూసి పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని తెలంగాణ ప్రాంత చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షించాలని కోరుతున్నారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా జనగామ ఆలయ చిత్రాలు నెటిజన్ల కోసం పోస్ట్ చేయబడ్డాయి.