Sunday, 10 March 2013


నేడు మహా శివరాత్రి


శివరాత్రికి ముస్తాబయిన స్థానిక శైవక్షేత్రాలు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలకు శివక్షేత్రాలు ముస్తాబయ్యాయి. భక్తుల సౌకర్యం కోసం బారికేడ్లు నిర్మించడంతో పాటు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని అతి పురాతనమైన జనగామ త్రిలింగేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మండపాలు నిర్మించడంతో పాటు గోదావరి నది వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలతో పాటు సాయంత్రం శివ కళ్యాణానికి ఆలయ ఆవరణలో పందిర్లు నిర్మించారు. పట్టణంలోని పవర్‌హౌజ్‌ కాలనీ శివాలయం, కోదండరామాలయంలోని శివాలయం, మార్కండేయ కాలనీ శివాలయం, వీరభ్రహ్మేంధ్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచే కోల్‌బెల్ట్‌లో పండుగ శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసేందుకు శివాజీనగర్‌లో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక దుకాణాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీపాలు, పూలు, పండ్లు ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. 
శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని
శనివారం కాలనీలోని సీ.ఈ.ఆర్‌ క్లబ్‌ ఆవరణలో మహా శివరాత్రి హంగామా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈతరం స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు స్టాలిన్‌గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు, యువతీ యువకులు నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.


శివరాత్రి విశేషం

వినాయకుడు చవితినాడు, రాముడు నవమిరోజు, కృష్ణుడు అష్టమినాడు పుట్టాడు. కాబట్టి ఆ పేర్లతో పండుగలు జరుపుకుంటున్నారు. మాఘమాసంలో బహుళ చతుర్ధశి శివోదయం అయిన శివ చతుర్ధశి అనకుండా శివరాత్రి అని పేర్కొనడం విశేషం. మహా శివరాత్రి ఏడాదికోసారి వచ్చినా ప్రతీ నెల అదే రోజు శివదీక్ష సాగించడం మరో విశేషం. దేవ, ఋషి, మానవ, రాక్షస గుణాలు భక్తి పూర్వకంగా ఉపవాస, జాగరణలు పాటించడం వెనక పరమార్తికమైన అంతరార్ధం ఉంది. జాతి, కుల, మత విక్షఛణ లేకుండా ఎవరికివారే శివరాత్రిని జరుపుకునే వెసులుబాటు ఉండడం మరింత విశేషం. మహా మాస శివరాత్రులు జ్ఞాన, ధ్యాన కార్మిక రూపంలో ఉపయోగించుకోవచ్చు. శివ అన్న పదానికి మంగళకరం, శుభం అని అర్ధం. శివుడు అంటే నిత్య మంగళకరమైన వస్తువు కాని మరొక్కటి కాదు. సూతులు కూడా శివస్వరూపమైన పరభ్రహ్మనే ప్రతిపాదిస్తున్నాయి. సత్యం, స్వప్రకాశం, అనంతం, అమృతం, ఆత్మ, బ్రహ్మ అన్నీ శివమే. ఆ శివస్వరూపమైన జ్ఞానమే కైవల్యము. చిత్రం ఏమిటంటే మంగళకరమైన శివునికి దోచరూపంగా భావించే రాత్రికి ఉన్న సంబంధం. అజ్ఞానరూపమైన చీకటి రాత్రిని జ్ఞానరూపమైన శివ శబ్దానికి అన్వయించటం అసంబద్దం అనిపించవచ్చు. ఇంద్రియ ప్రవృత్తులు వాటి వ్యాపారాలు అనిగి మనిగి ఉండటానికి రాత్రి సమయమే అనుకూలమైంది. రాత్రి అంటే జీవకోటి అలసిసొలసి నిద్రలో జోగే నిశిరాత్రి కానక్కర్లేదు. ఇంద్రియ నిగ్రహం మునికి వ్యవహార రూపమైన పగలు రాత్రిలాంటిదని, అవ్యవహారరూపమైన రాత్రి పగలువంటిదని భగద్గీత చెబుతుంది. ఇంద్రియ మనోబుద్దుల్ని శివార్పణం చేయటానికి ఇది ఒక చక్కని అవకాశం. ఉత్తమ, మద్యమ, అదమ జీవులందరికీ ఉపయోగకరంగా శివరాత్రిని జ్ఞాన శివరాత్రి, ధ్యాన శివరాత్రి, కార్మిక శివరాత్రి అని మూడు విధాలుగా యథాశక్తి వాడుకోవచ్చు. శివ వస్తువును గురించిన విచారప్రస్థానం జ్ఞాన శివరాత్రి. తైల ధరల శివ వస్తువుపైన, శరీర, ఇంద్రియ, మనో బుద్దులను ఏకాగ్రం చేయటం ధ్యాన శివరాత్రి. అశివ కర్మలకు దూరంగా నియతిలో కర్మచారునకు పూనుకోవటం కార్మిక శివరాత్రి. ఇది సదా ఆచరించటం వల్ల ఎలాంటి వాడైనా శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చునని చెబుతారు. అలా కుదరని పక్షంలో నెలకు ఒక్కసారైనా శివ కర్మలు ఆచరించటానికి మాస శివరాత్రి నిర్ధేశితమైంది. అందుకు నోచుకోని ఏ జీవియైన మహాశివరాత్రినాడు ఏడాదికి ఒకమారు శివరాత్రని పాటించగలిగితే ధన్యత చేకూరుతుందని చెబుతారు. ఇంత వెసులుబాటు ఉండటం వల్లే పరమార్ధిక సంస్కృతి బౌతిక జీవితాల్లో శివరాత్రి ఇంతగా ప్రత్యేకత సంతరించుకుంది.