Sunday, 3 March 2013


నేడు సింగరేణి ఆస్పత్రిలో సి.టి.స్కాన్‌ ప్రారంభం


గోదావరిఖని: స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రూ.2.7కోట్లతో నెలకొల్పిన సి.టి.స్కాన్‌ను ఆదివారం సింగరేణి సీఎండి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం సింగరేణి ఏరియా ఆస్పత్రిలో నెలకొల్పిన సి.టి.స్కాన్‌ ఇప్పటికే ఉపయోగంలోకి తీసుకువచ్చారు. కాగా నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ యంత్రంతో కిడ్నీలో ఏర్పడే రాళ్లు, పేగు కాన్సర్‌కు సంబంధించిన నిర్ధారణ, గర్భసంచిలో గడ్డలు, కడుపు నొప్పి నిర్ధారణ చేసి చికిత్స పొందే అవకాశముంటుంది. సి.టి.స్కాన్‌తో రామగుండం రీజియన్‌లో ఉన్న 22వేల మంది కార్మికులు, వారి కుటుంబీకులకు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు.