Saturday 16 March 2013


గ్రూప్‌-2 విజేత ఇమామ్‌బాబా
అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌గా 'ఖని' యువకుడు

Shaik Imam baba
గోదావరిఖని రమేష్‌నగర్‌కు చెందిన షేక్‌ ఇమామ్‌ బాబా ఎపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-2 ఫలితాల్లో సహాయ వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికయ్యాడు. ఇమామ్‌బాబా పదవ తరగతి వరకు స్థానిక వాసవ్య విద్యాలయంలో, ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివాడు. బయోకెమిస్ట్రీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాడు. పీహెచ్‌డీ చేసేందుకు పరిశోధక విద్యార్ధిగా కూడా ఎంపికయ్యాడు. అటు ఉన్నత విద్యను కొనసాగిస్తూనే ఇటు పోటీ పరీక్షలకు ప్రయత్నాలు చేశాడు. ఈనెల 11న కమీషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-2 ఫలితాలలో ఇమామ్‌బాబా ఎంపికైనట్లు పేర్కొన్నారు. వచ్చే వారంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేస్తారు. ఇమామ్‌బాబా అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌గా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, రమేష్‌నగర్‌ వాసులు, వాసవ్య విద్యాలయం ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.