Wednesday, 22 July 2015
భక్త జనసంద్రం "గోదావరి" ఖని
గోదావరిఖని లో తగ్గిన పుష్కరాల రద్దీ
గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద మంగళవారం రద్దీ తగ్గింది. శుక్ర, శని, ఆది వారాలు సెలవులు రావడంతో పాటు, సోమ వారం శివ భక్తులకు పవిత్రమైన రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాక దర్మపురి, కాళేశ్వరంలో భక్తుల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో చాలా మంది గోదావరిఖనికి వచ్చారు. దీంతో ఖనిలో భక్తిల తాకిడి పెరిగింది. సోమవారం వరకు కొనసాగిన రద్దీ మంగళవారం నుండి తగ్గుముఖం పట్టింది
Tuesday, 21 July 2015
రామగుండం టుడే ఆండ్రాయిడ్ ఆప్
రామగుండం టుడే ఇపుడు ఆండ్రాయుడ్ ఆప్ అందుబాటులోకి తెస్తున్నాం. త్వరలో గూగుల్ ప్లే నుండి ఈ ఆప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Tuesday, 14 July 2015
గోదావరిఖని గోదావరి బ్రిడ్జి సమీపంలో పుష్కర శోభ
To view full Album Click Here
, . , . . 25 . . .
రామగుండం అందాలు చూడతరమా
రామగుండం శ్రీ రామ పాద క్షేత్రంలో మంగళవారం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ప్రత్యెక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు . అక్కడి జలపాతాలు , కొండలు , లోయలు , ఆ అందాలను చుసిన భక్తులు , పర్యాటకులు ముగ్దులయ్యారు . నిజంగా ఇది రామగుండం ప్రాంతమేనా అని ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వారికోసం రామగుండం టుడే మీకు అందుబాటులోకి తెచ్చింది చూసి మీరు తరించండి మరి. మీ ఆనందాన్ని, అభిప్రాయాలని కామెంట్ రూపంలో వ్రాయండి
పూర్తి ఫోటో ఆల్బం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Wednesday, 11 February 2015
Saturday, 24 January 2015
పోచమ్మ గుడి మైదానంలో మహాధర్నా
గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి మైదానం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలనే డిమాండ్ తో రెండు రోజులు మహాధర్నా నిర్వహించారు ఈకార్యక్రమంలో కార్పోరేటరలు వివిధ పార్టీల సంఘాల నాయకులు వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు
Monday, 19 January 2015
తెలంగాణ 42, 43 ప్రజాసమితి గేట్ మీటింగ్
మేడిపల్లి ఓసిపి గనిలో తెలంగాణ 42, 43 ప్రజాసమితి సమావేశం సోమవారం నిర్వహించారు
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు
ఈనెల 21న లేబర్ కమీషనర్ తో జరిగే చర్చల్లో సింగరేణి అన్ని డివిజన్ల జీఎం లు పాల్గొని కార్మికుల సమస్యలు ప్రస్తావించాలని కోరారు
Saturday, 17 January 2015
సింగరేణి C&MDని కలిసిన పలు సంఘాలు
సింగరేణి సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ తొలిసారి రామగుండం ఏరియాలో పర్యటింటిన సందర్భంగా ఆయన్ను బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు మరియు హెచ్ ఎంఎస్ నాయకులు వేర్వేరుగా ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు సంస్థ అభివ్రుద్ధికి 33 వేల మంది బీసీ ఉద్యోగులు సహకారం అందిస్తారన్నారు
నాయకులు పి టి స్వామి కామని రాజేశం హెచ్ఎమ్మెస్ నాయకులు దేవ వెంకటేశం యాదగిరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
Friday, 16 January 2015
సంక్రాంతి ప్రాముఖ్యత
జనగామలో ఉచిత వైద్యశిబిరం
కార్పోరేషన్ పదవ వార్డు జనగామలో ఎల్ఆసి ఆద్వర్యంలో 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు
బిజెపి కార్పోరేటర్ జనగామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు