Wednesday, 22 July 2015

భక్త జనసంద్రం "గోదావరి" ఖని

బుధవారం గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద భక్తుల హడావిడి కనిపించింది. ఈనెల 14న ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాలు మరో మూడు రోజుల్లో ముగుస్తుండడం తో భక్తుల తాకిడి పెరుగుతోంది. మల్లి మహా పుష్కరాలు రావాలంటే 144 ఏళ్ళు పడుతుంది. గడిచిన వారం రోజులుగా గోదావరిఖని లో లక్షల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కార్పొరేషన్ అధికారులు, వివిధ స్వచ్చంద సంస్థల సభ్యులు సేవలు అందిస్తున్నారు