గోదావరిఖని లో తగ్గిన పుష్కరాల రద్దీ
గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద మంగళవారం రద్దీ తగ్గింది. శుక్ర, శని, ఆది వారాలు సెలవులు రావడంతో పాటు, సోమ వారం శివ భక్తులకు పవిత్రమైన రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాక దర్మపురి, కాళేశ్వరంలో భక్తుల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో చాలా మంది గోదావరిఖనికి వచ్చారు. దీంతో ఖనిలో భక్తిల తాకిడి పెరిగింది. సోమవారం వరకు కొనసాగిన రద్దీ మంగళవారం నుండి తగ్గుముఖం పట్టింది