Monday, 22 December 2014

కాకా ఇక లేరు

కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి కన్నుమూత


Latest News

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వెంకటస్వామి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వెంకట స్వామి అక్టోబర్ 5వ తేదీ 1929 సంవత్సరంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడినగా పలు పదవులు చేపట్టారు. ఆయన కుమారులు వినోద్ మంత్రిగా, డాక్టర్ వివెక్ ఎంపీగా పదవులు నిర్వహించారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ముషీరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో కాకా గాయపడ్డారు. ఉద్యమకారులను పోలీసులు హింసిస్తూన్నారని తెలుసుకున్న కాకా పార్లమెంట్ సభ్యుడై ఉండి తెలంగాణ ఉద్యమకారులను రక్షించడానికి జైలు వద్దకు వెళ్లారు. అక్కడ జరిగిన కాల్పుల్లో కాకా కాలికి గాయమైంది.

జి. వెంకటస్వామి నిర్వహించిన పదవులు
1957- 62 మరియు 1978-84 మెంబర్, ఆంధ్రపదేశ్ లెజిస్లేటివ్
1967 లో 4వ లోకసభకు ఎన్నికయ్యారు.
1969 - 71 మెంబర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటి.
1971 లో మల్లీ 5వ లోకసభకు (2nd టర్మ్) కూడా ఎన్నికయ్యారు.
ఫిబ్రవరి 1973 - నవంబర్. 1973 యునియన్ డ్యూటి మినిస్టర్, లేబర్ అండ్ రిహాబిలేషన్
నవంబర్. 1973-మార్చ్ 1977 యునియన్ డ్యూటి మినిస్టర్, సప్లై అండ్రిహాబిలేషన్
1977 లో మల్లీ 6వ లోకసభకు ఎన్నికయ్యారు. (3rd టర్మ్)
1978 - 1982 కాబినేట్ మినిస్టర్, లేబర్ అండ్ సివిల్ సప్లై, ఆంధ్రప్రదేశ్
1982 - 1984 అద్యక్షుడి గా, పి.సి.సి.(ఐ.), ఆంధ్రప్రదేశ్
1989 లో 9th లోకసభకు ఎన్నికయ్యారు.(4th టర్మ్)
1990 - 1991 మెంబర్, కమిటి ఆన్ ద వెల్ ఫేర్ ఆఫ్ సెడ్యూల్డ్ కాస్ట్ అండ్ సెడ్యూల్డ్ ట్రైబ్స్ , మెంబర్, కంసులేటివ్ కమిటి, మినిస్ట్రి ఆఫ్ ఇండస్ట్రీస్
1991 లో మల్లీ 10th లోకసభకు ఎన్నికయ్యారు.(5th టర్మ్)
21జూన్ 1991- 17 జనవరి.1993 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, రూరల్ డెవలప్ మెంట్
18జనవరి.1993 - 10 ఫిబ్రవరి.1995 యునియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, టెక్స్ టైల్ (ఇండిపెండెంట్ చార్జ్ )
10 ఫిబ్రవరి.1995 - 15 సెప్టెంబర్.1995 యునియన్ కాబినేట్ మినిస్టర్, టెక్స్ టైల్
15 సెప్టెంబర్.1995-10 మే 1996 యునియన్ కాబినేట్ మినిస్టర్, లేబర్
20 ఫిబ్రవరి. 1996-16 మే 1996 యునియన్ కాబినేట్ మినిస్టర్, లేబర్ అండ్ టెక్స్ టైల్
1996 లో మల్లీ 11th లోకసభకు ఎన్నికయ్యారు.(6th టర్మ్)
2002-2004 అద్యక్షుడి గా, ఎ.ఐ.సి.సి. ( ఎస్ సి & ఎస్ టి )
2004 లో మల్లీ 14th లోకసభకు ఎన్నికయ్యారు.(7th టర్మ్)
2009 లో 15th లోకసభ సభ్యుడిగా టికెట్ రాలేదు.
డిప్యుటి లీడర్ కాంగ్రెస్ పార్లమెంట్ పార్టి, లోకసభ మెంబర్, కమిటి ఆన్ ఎనర్జి మెంబర్, కమిటి ఆన్ ఇన్ స్టాలేషన్ ఆఫ్ పోట్రైస్ / స్టేటస్ ఆఫ్ నేషనల్ లీడర్స్, పార్లమెంటేరియన్ ఇన్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ మెంబర్, కమిటి ఆన్ ఎతిక్స్ మెంబర్, కన్ సులేటివ్ కమిటి , మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
5 ఆగష్టు. 2007 నుండి మెంబర్, స్టాండింగ్ కమిటి ఆన్ ఎనర్జి గా పదవులు నిర్వహించారు.